కులవృత్తులపై అగ్రవర్ణాల ఆధిపత్యం నశించాలి..

by Kodari Anjali |

నిబంధనలు బేఖరాతు చేస్తూ నాయిబ్రాహ్మణుల కులవృత్తిపై అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని అడ్డుకోవాలని కుల వృత్తులను కాపాడుతూ ఉపాధి రక్షణ కల్పించాలని నాయి బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ వ్యక్తం చేశారు.

కులవృత్తులపై అగ్రవర్ణాల ఆధిపత్యం నశించాలి..
X

దిశ, మల్కాజిగిరి: నిబంధనలు బేఖరాతు చేస్తూ నాయిబ్రాహ్మణుల కులవృత్తిపై అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని అడ్డుకోవాలని కుల వృత్తులను కాపాడుతూ ఉపాధి రక్షణ కల్పించాలని నాయి బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ వ్యక్తం చేశారు. తరతరాలుగా నాయి బ్రాహ్మణులు తమ జీవనాధారంగా నమ్ముకున్న క్షౌరవృత్తిపై (సెలూన్ షాపులు) అగ్రవర్ణాలకు చెందిన కొందరు వ్యక్తులు ఆధిపత్యం చలాయిస్తూ, నిబంధనలను బేఖాతరు చేస్తూ పొట్టగొడుతున్న వైనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రభుత్వ నిబంధనల ప్రకారం. ఒక క్షౌరశాలకు, మరొక క్షౌరశాలకు మధ్య కనీసం 300 మీటర్ల దూరం ఉండాలనే స్పష్టమైన నియమం ఉంది. అయితే, ఈ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తూ, కేవలం వ్యాపార మార్గంగా మార్చుకుని, మా ఉపాధిని దెబ్బతీసేలా సమాంతరంగా షాపులు ఏర్పాటు చేయడం అత్యంత విచారకరం. ఇది కేవలం వ్యాపార పోటీ కాదు, బలహీన వర్గాల ఆర్థిక పరిపుష్టిని దెబ్బతీసే అగ్రకుల ఆధిపత్య ధోరణి.ఈ ఆధిపత్యం వల్ల సాంప్రదాయకంగా ఈ వృత్తిపైనే ఆధారపడి బతుకుతున్న ఎన్నో నాయి బ్రాహ్మణ కుటుంబాలు నేడు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది.

మా డిమాండ్లు..

నిబంధనల అమలు: రెండు షాపుల మధ్య ఉండాల్సిన 300 మీటర్ల దూర పరిమితి నిబంధనను ఉల్లంఘించి ఏర్పాటు చేసిన సదరు షాపులపై స్థానిక అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. నాయి బ్రాహ్మణుల జీవన హక్కును, వృత్తిపరమైన ఉపాధిని రక్షించేలా ప్రభుత్వ యంత్రాంగం తగిన చర్యలు చేపట్టాలి. నిబంధనలు అతిక్రమించి, స్థానిక నాయి బ్రాహ్మణులను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. సామాజిక న్యాయం, రాజ్యాంగం కల్పించిన జీవన హక్కు అందరికీ సమానమే. నాయి బ్రాహ్మణుల ఉపాధికి గల ఆటంకాలను తొలగించి, మాకు న్యాయం జరిగే వరకు మా ఉమ్మడి పోరాటం కొనసాగుతుందని అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40 లక్షల నాయి బ్రాహ్మణులతో కలిసి అసెంబ్లీ ముట్టడి చేస్తామని మల్కాజిగిరి నాయిబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు గుండాల శ్రీనివాస్ నాయి ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు రవీందర్ నాయి గౌరవ సలహాదారు సాయిరాజ్ నాయి ప్రధాన కార్యదర్శి మహాదేవ్ నాయి సలహాదారులు భూమయ్య నాయి సభ్యులు శ్రీశైలం, ప్రవీణ్ కుమార్, నరసింహులు, జహంగీర్, శ్రీకాంత్ నాయి తదితరులు పాల్గొన్నారు.

Next Story