మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యం: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

by Taduka Kalyani |

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు.

మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యం: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
X

దిశ, కుత్భుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. బుధవారం సుభాష్ నగర్ డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 51వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటించారు. ఈ సందర్భంగా జీవన్ జ్యోతి నగర్, ముత్తయ్య నగర్, సుందర్ నగర్ లలో పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అభివృద్ధి పనులు పరిశీలించారు. రూ.20 లక్షలతో నూతనంగా చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు.

మిగిలి ఉన్న సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి అక్కడే ఉన్న అధికారులను ఆదేశించారు. ప్రజలకు అసౌకర్యం లేకుండా ఆయా పనులు వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మన్నె రాజు, పెద్ద వెంకటస్వామి, చిన్న వెంకటస్వామి, తారా సింగ్, ప్రభాకర్, రాజ్ కుమార్, కావలి రవి, బాల్ రెడ్డి, పోచయ్య ముదిరాజ్, చారి, మురళి, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

Next Story