ఉప్పల్ బస్ స్టాప్ వద్ద థార్ వాహనం దగ్ధం

by Taduka Kalyani |   (  Updated:2025-05-04 16:39:54  IST  )

ఉప్పల్ రింగ్ రోడ్డు వరంగల్ బస్ స్టాప్ వద్ద ఒక్కసారిగా కారు (థార్) లో నుంచి మంటలు చెలరేగిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

ఉప్పల్ బస్ స్టాప్ వద్ద థార్ వాహనం దగ్ధం
X

దిశ,ఉప్పల్: ఉప్పల్ రింగ్ రోడ్డు వరంగల్ బస్ స్టాప్ వద్ద ఒక్కసారిగా కారు (థార్) లో నుంచి మంటలు చెలరేగిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ కుమారుడు ప్రవీణ్ గౌడ్ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఉప్పల్లోని డిఎస్ఎల్ మాల్ లో షాపింగ్ కి వెళ్ళాడు. మాల్ నుంచి బోడుప్పల్ తన ఇంటికి తిరిగి వస్తుండగా టీఎస్ 09 ఎఫ్ వి 2666 నెంబర్ గల కారు లో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అది గమనించిన ప్రవీణ్ వెంటనే తన ఫ్యామిలీతో కలిసి బయటకు దిగాడు. మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాడు. 45 నిమిషాల తర్వాత అగ్నిమాపక సిబ్బంది రావడంతో అప్పటికే థార్ వాహనం పూర్తిగా దగ్ధమైంది. తృటిలో ప్రమాదం తప్పింది. ఉప్పల్ రింగ్ రోడ్డు ప్రాంతంలో కొంతసేపు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Next Story