స‌ర్వే నెంబ‌ర్ 79లో ఎమ్మెల్యే అనుచ‌రుడి క‌బ్జాల‌పై చ‌ర్య‌లు చేప‌ట్టండి

by Ratna Kumari |

గాజుల రామారంలో స్థానిక ఎమ్మెల్యే అనుచరుడు సర్వే నెంబర్ 79 లోని ప్రభుత్వ భూమిని చెరబట్టి కబ్జాలు చేస్తూ కోట్ల రూపాయలు లూటి చేస్తున్నాడని కొందరు వ్యక్తులు సీఎం ప్రజావాణిలో శుక్రవారం ఫిర్యాదు చేశారు.

స‌ర్వే నెంబ‌ర్ 79లో ఎమ్మెల్యే అనుచ‌రుడి క‌బ్జాల‌పై చ‌ర్య‌లు చేప‌ట్టండి
X

దిశ, కుత్బుల్లాపూర్ : గాజుల రామారంలో స్థానిక ఎమ్మెల్యే అనుచరుడు సర్వే నెంబర్ 79 లోని ప్రభుత్వ భూమిని చెరబట్టి కబ్జాలు చేస్తూ కోట్ల రూపాయలు లూటి చేస్తున్నాడని కొందరు వ్యక్తులు సీఎం ప్రజావాణిలో శుక్రవారం ఫిర్యాదు చేశారు. ప్రజావాణి ఇన్ చార్జి, మాజీ మంత్రి, తెలంగాణ స్టేట్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ డా. జీ. చిన్నారెడ్డి కీ తమ ఫిర్యాదు పత్రం అందించారు. సర్వే నెంబర్ 79 లో సుమారు 5 ఎకరాలు టీజీఐఐసీకీ చెందిన ప్రభుత్వ భూమి ఉందని.. ఆ భూమి మార్కెట్ విలువ ప్రకారం.. రూ.500 కోట్లు పలుకుతుందని తెలిపారు. ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు ఓ వ్యక్తి సర్వే నెంబర్ 219 పేరుతో నకిలీ పత్రాలు సృష్టిస్తూ ప్రభుత్వ భూమిని రోజుకింత చొప్పున కాజేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో రూ.వందల కోట్ల విలువ చేసే ఈ భూమి స్థానిక ఎమ్మెల్యే అండతో బీఆర్ఎస్ నాయకుడు కబ్జాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నా కాంగ్రెస్ నాయకులు ఆ భూమిని కాపాడే ప్రయత్నం చేయడం లేదని విమర్శలు చేశారు. సంబంధిత భూమిని కాడాలని కోరారు. దీంతో స్పందించిన మాజీ మంత్రి చిన్నారెడ్డి వెంటనే హైడ్రాకమిషనర్, టీజీఐఐసీ అధికారులు కబ్జాలకు గురవుతున్న ఆ భూమిని కాపాడాలని, కబ్జాదారుల పై తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ అంశంపై సంబంధిత శాఖలు విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Next Story