- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్ధుల కోసం సమ్మర్ స్పోర్ట్స్ కోచింగ్
తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకత్వంలో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పిల్లలు, యువతలో క్రీడాస్ఫూర్తి, శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేందుకు కోచ్ లు శిక్షణ ఇస్తున్నారు.

దిశ, మేడ్చల్ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకత్వంలో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పిల్లలు, యువతలో క్రీడాస్ఫూర్తి, శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేందుకు సమ్మర్ స్పోర్ట్స్ కోచింగ్ క్యాంపులు విజయవంతంగా నిర్వహించబడుతున్నాయి. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా కార్పొరేషన్ పరిధిలోని పలు సర్కిళ్లలో ఈ ప్రత్యేక కోచింగ్ క్యాంపులు ఏర్పాటు చేయబడగా.. విద్యార్థులు, యువత, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. నిపుణులైన కోచ్‌లు వివిధ క్రీడా విభాగాల్లో శిక్షణ అందిస్తున్నారు.
హుడా పార్కు, ఎస్ రావు నగర్ లో కరాటే, రోలర్ స్కేటింగ్, మల్లాపూర్ సీడీఎస్ బిల్డింగ్ లో కరాటే కోచింగ్, మల్లాపూర్ పీజీలో కరాటే కోచింగ్, ఎదులాబాద్ ఉర్వాయిగడ్డ వాలీబాల్ గ్రౌండ్‌లో సమ్మర్ స్పోర్ట్స్ కోచింగ్, బోయిన్‌పల్లి నెహ్రూ నగర్ ప్లే గ్రౌండ్ కిక్ బాక్సింగ్, నాగారం తెలంగాణ క్రీడాప్రాంగణంలో క్రికెట్ కోచింగ్, ఆర్‌కె పురం టీచర్ కాలనీ ప్లే గ్రౌండ్ సమ్మర్ స్పోర్ట్స్ కోచింగ్, గోల్నాక సమ్మర్ స్పోర్ట్స్ కోచింగ్ నిర్వహించబడుతున్నాయి. ఈ క్యాంపుల ద్వారా చిన్నారుల్లో క్రీడా ప్రతిభను వెలికితీయడం, శారీరక సామర్థ్యాన్ని పెంపొందించడం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. వేసవి సెలవులను సృజనాత్మకంగా, ప్రయోజనకరంగా వినియోగించుకునే మంచి అవకాశమని పేర్కొన్నారు.






