- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేడ్చల్ VBIT కాలేజీలో విద్యార్థుల ధర్నా
వార్డెన్ విద్యార్థినిల వీడియోలు తీసి ఇతరులకు పంపిస్తున్నారంటూ ధర్నాకు దిగారు ఓ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు.

దిశ, వెబ్ డెస్క్ : వార్డెన్ విద్యార్థినిల వీడియోలు తీసి ఇతరులకు పంపిస్తున్నారంటూ ధర్నాకు దిగారు ఓ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు. మేడ్చల్(Medchal) జిల్లాలోని ఔషాపూర్లో(Oushapur) గల విజ్ఞాన భారతి ఇంజనీరింగ్ కాలేజీ(VBIT)లో శుక్రవారం విద్యార్థులు భారీ ఆందోళనకు దిగారు. హాస్టల్ లో వార్డెన్ రూప విద్యార్థినుల వీడియోలు తీస్తోందని ఆరోపించారు. వార్డెన్ అమ్మాయిల ప్రైవేట్ వీడియోలను చిత్రీకరించడం గమనించిన కొందరు విద్యార్థినులు.. ఇదేమిటని ఫోన్ లాక్కొని చూడగా.. ఆ ఫోన్లో మరిన్ని వీడియోలు ఉన్న విషయం బయటికి వచ్చింది. అంతేకాదు వార్డెన్ ఆ వీడియోలను ఇతర వార్డెన్స్ కు చేరవేసిందనే విషయాన్ని గుర్తించిన విద్యార్థులు.. శుక్రవారం భారీ ధర్నాకు దిగారు.
వెంటనే వార్డెన్ మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ వందలాది మంది విద్యార్థులు కాలేజీ ముందు ఆందోళనకు దిగడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు కాలేజీ వద్దకు చేరుకొని విద్యార్థులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు.






