యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు..కొంపల్లిలో ఆకాశాన్ని తలదన్నేలా నిర్మాణాలు

by velandi.Saikiran |

కొంపల్లి సర్కిల్ లో అక్రమ నిర్మాణాల పరంపర కొనసాగుతోంది. ఆకాశాన్ని తలదన్నేలా అ క్రమ నిర్మాణాలు సాగుతున్నాయి.

యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు..కొంపల్లిలో ఆకాశాన్ని తలదన్నేలా నిర్మాణాలు
X

యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు

-కొంపల్లిలో ఆకాశాన్ని తలదన్నేలా నిర్మాణాలు

-కాసులకు కక్కుర్తి పడుతూ కబ్జాదారులకు పరోక్ష సహకారం

-టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై విమర్శల

-పరదాల చాటున బహుళ అంతస్తుల నిర్మాణాలు

-సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్న అధికారాలు

-ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి

దిశ, దుండిగల్:కొంపల్లి సర్కిల్ లో అక్రమ నిర్మాణాల పరంపర కొనసాగుతోంది. ఆకాశాన్ని తలదన్నేలా అ క్రమ నిర్మాణాలు సాగుతున్నాయి. అనుమతులు ఒకలా తీసుకుంటు న్న యజమానులు నిర్మాణాలు మ రోలా సాగిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడడంలేదు. కాసులకు కక్కుర్తి పడు తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు యజమానులకు పరోక్ష సహకారం అందిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంపల్లి సర్కిల్ లో ఉన్నతాధికారుల సమన్వయలోపం అక్ర మ నిర్మాణదారులకు కలిసొచ్చే అం శంగా మారింది. జీ+ప్లస్ 3 అనుమతులు పొందిన నిర్మాణదారులు పరదాల చాటున జీ+5 చేపడుతున్నారు. కొంపల్లి సర్కిల్‌లోని సుభా ష్ నగర్ డివిజన్ లోని ఎస్‌ఆర్ నా యక్ నగర్, లాస్ట్ బస్ స్టాప్ ప్రాంతాలతోపాటు జయభేరి కాలనీ, దూల పల్లి డివిజన్, అపర్ణా ఫామ్ మెడోస్ ప్రాంతాల్లో జోరుగా నిర్మాణాలు సాగుతున్నా అధికారులు సంబం ధం లేనట్లుగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది.

పరదాల చాటున నిర్మాణాలు

సుభాష్ నగర్ డివిజన్, జయభేరి గార్డెన్ లో జీ+3 అనుమతులతో జీ+5 నిర్మాణాలు సాగిస్తున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడంలేదు. అధికారులే అక్రమ నిర్మాణదారులకు సలహాలిస్తూ పరోక్ష సహకారం అందిస్తున్నట్లు విమర్శ లు వినిపిస్తున్నాయి.

కలిసి వచ్చే అంశం..

కొంపల్లి సర్కిల్‌లో అధికారుల సమ న్వయ లోపం కొట్టిచ్చినట్లు కనబడుతుంది, టౌన్ ప్లానింగ్ ఏసీపీ సమాధానాలు దాటవేస్తుండడం. డిప్యూటీ కమిషనర్‌ను వివరణ కోరగా సంబంధం లేనట్లుగా వ్యవహరించడం అధికారుల సమన్వయలోపానికి అద్ధంపడుతోంది. టౌన్ ప్లానింగ్ ఏసీపీ, డిప్యూటీ కమిషనర్ ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తుండడంతో అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట పడడం లేదంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పట్టించుకోని యజమానులు

మున్సిపల్ ఆదాయానికి వెన్నముఖలాంటి టౌన్ ప్లానింగ్ లో అవినీతి కంపుకొడుతుంది. అవినీతి అధికారులే లక్ష్యంగా వరుసగా ఏసీబీ దా డులు జరుతున్నా వారి తీరు మారడంలేదు. అక్రమ నిర్మాణదారుల నుంచి అందినకాడికి దండుకుం టూ సర్కిల్ ఆదాయానికి గండికొడుతున్నట్లు ఆరోపణలున్నాయి.

అక్రమ నిర్మాణాలు తొలగిస్తాం: డిప్యూటీ కమిషనర్

కొంపల్లిలో జరుగుతున్న అక్ర మ నిర్మాణాలపై డిప్యూటీ కమిషనర్ కృష్ణారెడ్డి ని వివరణ కోరగా నిబంధనల ప్రకారం అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ఏసీపీకి ఆదేశా లు జారీ చేశామన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్య లు తప్పవన్నారు.

Next Story