- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిన్నారులు అధికంగా సందర్శించే ఆహార కేంద్రాల్లో ప్రత్యేక ఆహార భద్రత తనిఖీలు
మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా 59వ రోజు సందర్భంగా చిన్నారులు అధికంగా సందర్శించే ఆహార విక్రయ కేంద్రాల్లో ప్రత్యేక ఆహార భద్రత తనిఖీలు నిర్వహించినట్టు ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు.

దిశ, మేడ్చల్ బ్యూరో : మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా 59వ రోజు సందర్భంగా చిన్నారులు అధికంగా సందర్శించే ఆహార విక్రయ కేంద్రాల్లో ప్రత్యేక ఆహార భద్రత తనిఖీలు నిర్వహించినట్టు ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ ప్రత్యేక తనిఖీలు ఆదివారం కార్పొరేషన్ పరిధిలోని పాఠశాలల పరిసరాలు, ఆట స్థలాలు, పార్కులు, బేకరీలు, ఫుడ్ కోర్టులు వంటి చిన్నారులు తరచుగా సందర్శించే ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మొత్తం 46 ఆహార విక్రయ కేంద్రాలను అధికారులు తనిఖీ చేశారని పారిశుధ్య అదనపు కమిషనర్ రఘుప్రసాద్ తెలిపారు. తనిఖీల సందర్భంగా ఆహార వ్యాపార నిర్వాహకులకు ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల సరైన లేబులింగ్, ఆహార పదార్థాల నిల్వ సంరక్షణ ప్రమాణాలు, పురుగుల నివారణ చర్యలు, సంబంధిత రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా, అనుమానాస్పదంగా గుర్తించిన కొన్ని ఆహార నమూనాలను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం-2006 ప్రకారం.. ప్రయోగశాల పరీక్షల నిమిత్తం సేకరించారు. తనిఖీల్లో గుర్తించిన నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి 22 నోటీసులు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. భవిష్యత్తులో అన్ని ఆహార విక్రయ సంస్థలు ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ, ప్రజలకు నాణ్యమైన మరియు సురక్షితమైన ఆహారాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు.






