బోనాల జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి

by Taduka Kalyani |

వరసగా రాబోతున్న బోనాల పండుగను పురస్కరించుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాటు చేయాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కోరారు.

బోనాల జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి
X

దిశ, తిరుమలగిరి : వరసగా రాబోతున్న బోనాల పండుగను పురస్కరించుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాటు చేయాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కోరారు. ఈ మేరకు సోమవారం ఎమ్మెల్యే మల్కాజిగిరి డిసిపి శ్రీధర్, ట్రాఫిక్ డిసిపి రాహుల్ రెడ్డిలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బోనాల ఉత్సవాల ఏర్పాట్లు, శాంతిభద్రతల పరిరక్షణ,వాహనాల రాకపోకలకు సంబంధించి పలు కీలక అంశాలపై వారితో చర్చించారు. ఆలయాల వద్ద భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, సీసీ కెమెరాల నిఘా పెంచాలని, అసాంఘిక శక్తులపై ప్రత్యేక దృష్టి సాధించాలని డిసిపిని కోరారు. అదేవిధంగా ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయాలని, భక్తుల వాహనాలకు అనుకూలంగా పార్కింగ్ స్థలాలను కేటాయించాలని సూచించారు.

Next Story