అత్తపై అత్యాచారం చేసిన అల్లుడు

by velandi.Saikiran |

అత్తపై అత్యాచారం చేసిన అల్లుడికి జైలు శిక్ష విధించింది మేడ్చ‌ల్ కోర్టు. ఈ మేర‌కు నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష ప‌డింది.

అత్తపై అత్యాచారం చేసిన అల్లుడు
X
  • అత్తపై అత్యాచారం చేసిన అల్లుడు
  • నిందితుడికి 10 ఏళ్ళ శిక్ష

దిశ, నాచారం : అత్తపై అల్లుడు అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 10 వెల నగదు జరిమానా విధిస్తూ మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ సంఘటన నాచారం పోలీస్ స్టేషన్‌ పరిధిలో చోటు చేసు కుంది. పోలీసులు వెల్లడించిన వివరాలు ప్రకారం.. వరంగల్ జిల్లా, వెంకటాపూర్ మండలం, రామప్ప విలేజ్ చెందిన మెనుగు రమేష్( 38) వృత్తిరీత్యా ప్రైవేట్ ఉద్యోగి. మల్లాపూర్ కేఎల్ రెడ్డి నగర్ లో నివాసం ఉంటున్నాడు.

2019 లో భార్యతో విభేదాలు రావడంతో పుట్టింటికి వెళ్ళింది. పిల్లలు ఇచ్చిన అత్త ను మాట్లాడుదాం రా.. అని పిలిపించి అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితులు నాచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టుకు వివరాల అందజేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కోర్టు శుక్రవారం తీర్పును వెలువరించింది. నిందితుడికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష తో పాటు అదనంగా రూ. 10, వెల జరిమానా విధించి నట్లు పోలీసులు తెలిపారు.

Next Story