- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > మేడ్చల్ > MLA Marri Rajasekhar Reddy : రాజీవ్ వీకర్ సెక్షన్ కాలనీలో పాముల బెడద...
MLA Marri Rajasekhar Reddy : రాజీవ్ వీకర్ సెక్షన్ కాలనీలో పాముల బెడద...
by Batti.Sumithra |
చెరువును ఆనుకొని ఉన్న రాజీవ్ వీకర్ సెక్షన్ కాలనీలో నిత్యం పాముల బెడదను ఎదర్కొంటు భయం భయంగా బ్రతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

X
దిశ, అల్వాల్ : చెరువును ఆనుకొని ఉన్న రాజీవ్ వీకర్ సెక్షన్ కాలనీలో నిత్యం పాముల బెడదను ఎదర్కొంటు భయం భయంగా బ్రతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం మాజీ ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని కలిసి తమ ఇబ్బందులను వివరించారు. చెరువుకు దగ్గర ఉండడంతో పాటు ఇండ్లను ఆనుకొని ఏపుగా పెరిగిన చెట్ల పొదలు ఉండడంతో ఏ క్షణాన ఏ పాములు, పురుగులు వస్తాయో అని కంటికి కునుకు లేకుండా రాత్రులు గడపవలసి వస్తుందని ఆవేదన వెలిబుచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపల్ అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని కాలనీవాసులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో రహమత్ ఖాన్, గౌస్ ఖాన్, సయ్యద్ ఆరిఫ్ పాల్గొన్నారు.
Next Story






