- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్రమంగా నిల్వ ఉంచిన గ్యాస్ సిలిండర్ల పట్టివేత..
అక్రమంగా నిల్వ ఉంచిన గ్యాస్ సిలిండర్లను విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం పోలీసులు పట్టుకున్నారు.

దిశ, నాగారం: అక్రమంగా నిల్వ ఉంచిన గ్యాస్ సిలిండర్లను విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని కరీంగూడ, రాంపల్లిలో చోటుచేసుకుంది. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ రమేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్పీజీ వాణిజ్య, గృహ వినియోగ సిలిండర్ల నిల్వ గురించి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు మేడ్చల్ జిల్లా, కీసర మండలంలోని కరీంగూడ, రాంపల్లి గ్రామాలలోని రెండు ప్రదేశాలలో ఈటీఎఫ్ టీమ్-5 సోమవారం దాడులు నిర్వహించింది. ఈ దాడులలో వాణిజ్య, గృహ వినియోగ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసినట్లు తెలుసుకున్నారు. వివరాల్లోకెళ్తే. కరీంగూడ (గ్రామీణ)లో, ఇంటి నెం. 16-2-49కి ఆనుకొని ఉన్న బహిరంగ ప్రదేశంలో గృహ వినియోగ సిలిండర్లు కనుగొన్నామని తెలిపారు. ఒక్కొక్కటి 19.5 కేజీల బరువు గల మొత్తం వాణిజ్య సిలిండర్లు - 53 (14 నిండుగా, 39 ఖాళీగా ఉన్నాయన్నారు. గృహ వినియోగ సిలిండర్లు - 4 ఖాళీగా, 5 కేజీల బరువు గల చిన్న సిలిండర్లు - 4, విశ్వనాథ్ తండ్రి అయిన రాకేష్ అనే వ్యక్తి ఈ పని చేసినట్లు వెల్లడైంది.
సిలిండర్లు స్వాధీనం..
అలాగే16-2-49కీసర మండలం, కరీంగూడ నివాసి గృహ, వాణిజ్య సిలిండర్లను అక్రమంగా విక్రయిస్తున్నాడు. కీసర మండలంలోని రాంపల్లి గ్రామంలో ఇంటి నెం.7-1-44 ఖాళీ స్థలంలో ఒక ఆటోలో మొత్తం 23 వాణిజ్య సిలిండర్లు, 4 నిండువి 19 ఖాళీవి కనుగొన్నారు. ఇంటి నెం.16-2-49 కరీంగూడ గ్రామ నివాసి అయిన ఎనుగు జంగారెడ్డి ఈ అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు వెల్లడైంది. 7-1-44, రాంపల్లిలో వాణిజ్య సిలిండర్లను అక్రమంగా విక్రయిస్తున్నారు. రెండు చోట్ల వాణిజ్య, గృహ, చిన్న 5 కేజీల రకాలకు చెందిన మొత్తం 84 సిలిండర్లు లభ్యమయ్యాయి. ఈ బృందం వెంటనే సంబంధిత మేడ్చల్ జిల్లా డిటిసిఎస్ ని సంఘటనా స్థలానికి పిలిపించి పంచనామా నిర్వహించి సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేశామన్నారు. అలాగే అన్ని సిలిండర్లను భద్రంగా ఉంచడం కోసం గ్యాస్ ఏజెన్సీకి తరలించామన్నారు. తదుపరి చర్యల కోసం సిలిండర్లను స్వాధీనం చేసుకుని డిటికి అప్పగించడం జరిగిందన్నారు.






