- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమంగా తరలిస్తున్న గోవుల పట్టివేత
అక్రమంగా 15 గోవు దూడలను తరలిస్తున్న వ్యాన్ ను పట్టుకొని, ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

దిశ, ఘట్కేసర్: అక్రమంగా 15 గోవు దూడలను తరలిస్తున్న వ్యాన్ ను పట్టుకొని, ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... యమ్నంపేట్ ఎక్స్ రోడ్డు వద్ద బుధవారం వాహనాలు తనిఖీ చేశారు పోలీసులు. వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న అశోక్ లేలాండ్ గూడ్స్ వాహనంలో (AP 39 WP 9110) 15 గోవు దూడలను తరలిస్తున్నట్లు గుర్తించి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
డ్రైవర్ వైబోయిన శ్రీనివాసరావు, హెల్పర్ చందక కాశీబాబులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో బహదూర్‌పురకు చెందిన పశువుల వ్యాపారి ఇసాక్ ఆదేశాల మేరకు తుని పశువుల మార్కెట్ నుండి గోవు దూడలను బహదూర్‌పురాకు తరలిస్తున్నట్లు అంగీకరించారు. నిందితులపై తెలంగాణ గోవధ నిషేధ చట్టం-1977, జంతు హింస నివారణ చట్టం-1960 కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. చట్ట విరుద్ధంగా పశువుల రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.






