- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కల్మషం లేని వ్యక్తి సాయన్న: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ
by Kema Shiva Kumar |
కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతి దిగ్బ్రాంతికి గురి చేసిందని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు.

X
దిశ, కంటోన్మెంట్ /బోయిన్ పల్లి: కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతి దిగ్బ్రాంతికి గురి చేసిందని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఎమ్మెల్యే సాయన్న కుటుంబ సభ్యులను కార్ఖానాలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన పరామర్శించి ఓదార్చారు. సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా సేవలందించిన సాయన్న ఆకస్మిక మరణం కంటోన్మెంట్ కు తీరని లోటన్నారు. సాయన్న కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి వారికి ధైర్యం చెప్పారు. సాయన్న లాంటి మృధుస్వభావిని కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు.
Next Story






