వైభవంగా సత్యనారాయణ స్వామి అర్ధ శతాబ్ది వార్షిక బ్రహ్మోత్సవాలు..

by Disha Web Desk 11 |
వైభవంగా సత్యనారాయణ స్వామి అర్ధ శతాబ్ది వార్షిక బ్రహ్మోత్సవాలు..
X

దిశ, ఉప్పల్: రామంతాపూర్ డివిజన్ ఇందిరానగర్ కాలనీలో శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి వారి అర్ధ శతాబ్ది వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మి హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎం సత్య చంద్రారెడ్డి, ఆలయ మాజీ చైర్మన్ కోట్ల నరసింహారెడ్డి, ఆలయ సిబ్బంది మురళీధర్ రావు, శంకర్, రామంతపూర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకటరావు, గ్రంథాలయ చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డి, చర్లపల్లి కార్పొరేటర్ బొంతూ శ్రీదేవి, మాజీ మేయర్ బొంతూరామ్మోహన్, మాజీ కార్పొరేటర్లు గంధం జ్యోత్న నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed