ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన స్కూల్ బస్సు.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు

by Kodari Anjali |

ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్‌హెచ్-44 జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన స్కూల్ బస్సు.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
X

దిశ, మేడ్చల్: ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్‌హెచ్-44 జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సెయింట్ క్లారెట్ (St. Claret) స్కూల్‌కు చెందిన బస్సు రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాలు కాగా, వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ఇతర విద్యార్థులు సురక్షితంగా బయటపడడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టగా, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story