- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుళ్ళిపోయిన మామిడి తాండ్ర
కుళ్లిపోయిన మామిడి తాండ్ర విక్రయించిన దుకాణంపై బాధితుడు ఫిర్యాదు చేసినా జిహెచ్ఎంసి ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టించుకోని

దిశ , కాప్రా: కుళ్లిపోయిన మామిడి తాండ్ర విక్రయించిన దుకాణంపై బాధితుడు ఫిర్యాదు చేసినా జిహెచ్ఎంసి ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టించుకోని సంఘటన కాప్రా సర్కిల్ పరిధిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు.... కుషాయిగూడ సాయి నగర్ కాలనీకి చెందిన సదానంద్ గౌడ్ ఈనెల 21వ తేదీన ఏఎస్ రావు నగర్ లోని శ్రీవల్లి ట్రెడిషనల్ ఫుడ్స్ లో పలు తిను బాండరాలను కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లి కొనుగోలు చేసిన మామిడి తాండ్రను తన కుమారుడు తిని వాంతి చేసుకున్నాడు.
దీంతో మామిడి తాండ్రను పరిశీలించిన సదానంద గౌడ్ పూర్తిగా కుళ్ళిపోయి భరించలేని దుర్వాసన రావటాన్ని గమనించాడు. మామిడి తాండ్ర తిని తన కుమారుడు అస్వస్థత గురయ్యాడని, శ్రీవల్లి ట్రెడిషనల్ ఫుడ్స్ పై ఆన్లైన్ లో జిహెచ్ఎంసి ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఆన్లైన్ లో ఫిర్యాదు అందుకున్న అధికారులు గురువారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, నాణ్యత లోపించిన తిను పదార్థాలను విక్రయిస్తున్న శ్రీవల్లి ట్రెడిషనల్ ఫుడ్స్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు.






