- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాలా కబ్జాచేస్తున్న వారి పై చట్టరిత్యా చర్యలు తీసుకుంటాం : తహసిల్దార్ గోవర్ధన్
దర్జాగా నాలా కబ్జా అన్న శీర్షికన దిశ పత్రికలో శుక్రవారం ప్రచురితమైన కథనానికి రెవెన్యు, ఇరిగేషన్ అధికారులు స్పిందించారు.

దిశ, కూకట్పల్లి : దర్జాగా నాలా కబ్జా అన్న శీర్షికన దిశ పత్రికలో శుక్రవారం ప్రచురితమైన కథనానికి రెవెన్యు, ఇరిగేషన్ అధికారులు స్పిందించారు. కూకట్పల్లి మండలం కైత్లాపూర్ గ్రామంలోని డంపింగ్ యార్డు పక్కనుంచి వెళుతున్న ముళ్లకత్వ చెరువు నాలాను కొంత మంది మట్టితో నింపి చదునుచేస్తున్న విషయాన్ని దిశ వెలుగులోకి తీసుకు వచ్చింది. కూకట్పల్లి ఇరిగేషన్ ఏఈ లక్ష్మీనారాయణ, మండల రెవెన్యు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డిలు శుక్రవారం నాలా కబ్జా జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ముళ్లకత్వ నుంచి కాముని చెరువుకు వెళుతున్న నాలా 13 మీటర్లు ఉండాల్సి ఉండగా గతంలోనే నాలా కుచించుకుపోయి 9 మీటర్లకు చేరింది. తాజాగా 9 మీటర్లు ఉన్న నాలాను ప్రసాద్ రాజ్ సంస్థ వారు మరో 3 మీటర్లు మట్టి నింపడంతో నాలా 6 మీటర్లకు కుచించుకు పోయిందని ఇరిగేషన్ ఏఈ లక్ష్మీనారాయణ తెలిపారు. నాలాలో మట్టి పోసి నింపిన వారిపై చట్టరిత్య చర్యలు తీసుకుంటామని లక్ష్మీనారాయణ తెలిపారు.
చట్టరిత్యా చర్యలు తీసుకుంటాం.. కూకట్పల్లి తహసిల్దార్ గోవర్ధన్ ..
నాలాలో మట్టి పోసిన వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని తహసీల్దారు అన్నారు. ఆర్ఐని పూర్తి నివేదికను సమర్పించాల్సిందిగా ఆదేశించామని తెలిపారు. నివేదిక సిద్ధం చేసి నాలా కబ్జాకు పాల్పడిన వారిపై కేసునమోదు చేస్తాం.






