- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రామచందర్ రావు హౌస్ అరెస్టు అప్రజాస్వామికం: ఎంపీ ఈటల రాజేందర్
కామారెడ్డికి వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడాన్ని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు.

దిశ,మేడ్చల్: కామారెడ్డికి వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడాన్ని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా తన పార్టీ ఎమ్మెల్యేకు సంఘీభావం తెలపడానికి వెళ్లడం కూడా నేరమా అని ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇదే తరహా హౌస్ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసిందని, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అదే విధానాన్ని అనుసరిస్తున్నారని విమర్శించారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వమే ప్రతిపక్షాలపై ఆంక్షలు విధించడం సరికాదన్నారు. సంఘీభావం తెలపడానికి వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులను హౌస్ అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఈటెల పేర్కొన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ నేతలే గుండాయిజానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విధానం పై ప్రభుత్వం సిగ్గుపడాలని, ప్రజలు తగిన సమాధానం చెబుతారని ఆయన హెచ్చరించారు.






