- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ గార్డెన్స్‌లో బహిరంగ సభను విజయవంతం చేయాలి : ఎమ్మెల్యే
by Batti.Sumithra |
కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని తెలంగాణ గార్డెన్స్‌లో ఈ నెల 25న నిర్వహిస్తున్న బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.

X
దిశ, కూకట్పల్లి : కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని తెలంగాణ గార్డెన్స్‌లో ఈ నెల 25న నిర్వహిస్తున్న బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్సి నవీన్ కుమార్, నియోజకవర్గ కార్పొరేటర్లు, డివిజన్ల అధ్యక్షులు, ముఖ్యనాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ఈనెల 25వ తేదిన ప్రతి ఒక్క డివిజన్లో జెండా పండుగ సందర్భంగా జెండా పండుగను నిర్వహించి అక్కడి నుంచి తెలంగాణ గార్డెన్స్‌లో జరుగుతున్న బహిరంగ సభకు తరలి రావాలని సూచించారు. ఎండల తీవ్రత ఎక్కువ ఉండటం కారణంగా కార్యకర్తలు ఇబ్బంది పడకుండా కార్పొరేటర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, తాగునీటిని అందుబాటులో ఉంచాలని కోరారు.
Next Story






