- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యే దీక్షకు ప్రొఫెసర్ కోదండరాం మద్దతు
కంటోన్మెంట్ బోర్డులో నామినేటెడ్ వ్యవస్థను రద్దు చేసి,కేంద్ర ప్రభుత్వం వెంటనే కంటోన్మెంట్ ను రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేయాలనే డిమాండ్ తో కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ చేస్తున్న రిలే నిరహార దీక్షలు సోమవారం నాటికి 7వ రోజుకు చేరుకున్నాయి.

దిశ, తిరుమలగిరి : కంటోన్మెంట్ బోర్డులో నామినేటెడ్ వ్యవస్థను రద్దు చేసి,కేంద్ర ప్రభుత్వం వెంటనే కంటోన్మెంట్ ను రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేయాలనే డిమాండ్ తో కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ చేస్తున్న రిలే నిరహార దీక్షలు సోమవారం నాటికి 7వ రోజుకు చేరుకున్నాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇన్ చార్జి ఆడెం సంతోష్ తమ అనుచరులతో కలిసి దీక్షా శిబిరం వద్దకు చేరుకొని తమ సంఘీభావాన్ని తెలియజేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కంటోన్మెంట్ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవించి కేంద్ర ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎమ్మెల్యే రిలే నిరహార దీక్షకు తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ ఉద్యమ నేత, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తన నిరంకుశ వైఖరితో కంటోన్మెంట్ ప్రాంతంలో ప్రజాస్వామ్యం లేకుండా నామినేటెడ్ వ్యవస్థతో కంటోన్మెంట్ ప్రజలపై చేస్తున్న రాచరిక పాలనకు వ్యతిరేకంగా, మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేయాలనే డిమాండ్ చేసారు. కంటోన్మెంట్ ప్రజల పక్షాన నిలబడడానికి దీక్షా శిబిరానికి వచ్చిన నాయకులకు నియోజకవర్గ ప్రజల తరపున కంటోన్మెంట్ ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.






