పంచాయితీ ఎన్నికల ప్రిపరేషన్.. గ్రౌండ్ వర్క్ చేస్తున్న అధికారులు

by Ramesh Goud |

గ్రామపంచాయతీ ఎన్నికలకు అధికారులు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకున్నారు.

పంచాయితీ ఎన్నికల ప్రిపరేషన్.. గ్రౌండ్ వర్క్ చేస్తున్న అధికారులు
X

దిశ, మేడ్చల్ బ్యూరో: గ్రామపంచాయతీ ఎన్నికలకు అధికారులు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకున్నారు. ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎన్ని వార్డులు, మహిళ పురుష ఓటర్లు నిష్పత్తి తదితర అంశాలపై ఇప్పటికే నివేదికలు రూ పొందించుకున్నారు. 2024, సెప్టెంబర్‌లో ఇందుకు సంబంధించిన రిపోర్టును రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కు అందజేశారు.

34 గ్రామపంచాయతీలలో 320 వార్డులు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఒక పంచాయతీ డివిజన్ ఉంది. ఇందులో 3 రూరల్ మండలా లు ఉండగా వాటిలో 34 గ్రామ పంచాయతీల కు ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటిలో మొ త్తంగా 320 వార్డులున్నాయి. మేడ్చల్ మండ లంలో 14 గ్రామ పంచాయతీలకు గానూ 126 వార్డులు, మూడు చింతలపల్లి మండలం పరిధి లో 13 గ్రామ పంచాయతీలకు 122 వార్డులు, శామీర్ పేట్ మండలంలో 7 గ్రామ పంచాయతీల్లో 72 వార్డులున్నాయి. అన్ని వార్డుల్లో కలిపి సెప్టెంబర్, 2024 వరకు 66 వేల 46 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు లెక్క తేల్చారు.

మండలాలవారీగా..

మేడ్చల్ మండలంలో 126 వార్డుల్లో మొత్తం 22 వేల 675 ఓటర్లు ఉండగా వీటిలో 11వేల 320 పురుష ఓటర్లు, 11వేల 355 మహిళా ఓటర్లు ఉన్నారు. మూడు చింతలపల్లి మండల పరిధిలో 122 వార్డుల్లో 20వేల 911 మంది ఓటర్లు ఉండగా వీరిలో 10వేల 446 మంది పురుష ఓటర్లు, 10వేల 465 మంది మహిళా ఓటర్లున్నారు. శామీర్ పేట్ లో 72 వార్డుల్లో మొత్తంగా 22వేల 460 మంది ఓటర్లు ఉండగా వీరిలో 11,384 మంది పురుష ఓటర్లు 11వేల 73 మంది మహిళా ఓటర్లు, ఇతరులు ముగ్గురు ఉన్నారు. 3 మండలాలలో ఒక శామీర్ పేట్ మండలంలో తప్ప మిగిలిన రెండు మండలాల్లో మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు నోటిఫికేషన్ విడుదలై ఎన్నికలు జరిగే సమయానికి వివరాల్లో భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది.

ఎస్సీలే అధికం..

రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారులు 2024, సెప్టెంబర్ లో ఓటర్ల లిస్టుతో పాటు 2011 లెక్కల ప్రకా రం 3 మండలాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ జనాభాను తెలుపుతూ రిపోర్టు అందజేశారు. జిల్లా పంచా యతీ డివిజన్లలోని మూడు మండలాల్లో ఎస్సీ జనాభానే ఎక్కువ. జిల్లా పరిధిలో ఉన్న మూడు చింతలపల్లి మండలంలో ఎస్టీ జనాభా 1444, ఎస్సీ జనాభా 4451 ఉండగా ఇతరులు 17వేల 370 జనాభా, శామీర్ పేట్ మండలంలో ఎస్సీ లు 472 మంది, ఎస్టీలు 3753, ఇతరులు 17 వేల 402 మంది ఉన్నారు. మేడ్చల్ మండలం లో ఎస్టీలు 2వేల 779 మంది ఉండగా ఎస్సీలు 4133 మంది, ఇతరులు 22వేల మంది ఉన్నా రని అధికారులు వివరించారు.

Next Story