- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో నిర్మాణాలపై సీరియస్
by Sridhar Babu |
మండల పరిధి అల్లాపూర్ డివిజన్లోని సున్నం చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలకు మండల రెవెన్యు అధికారులు బుధవారం నోటీసులు అందజేశారు.

X
దిశ, కూకట్పల్లి : మండల పరిధి అల్లాపూర్ డివిజన్లోని సున్నం చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలకు మండల రెవెన్యు అధికారులు బుధవారం నోటీసులు అందజేశారు. ఇండ్లకు నోటీసులు అతికించారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాల ప్రకారం చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన వారికి నోటీసులు అందజేస్తున్నట్టు తహసీల్దార్ స్వామి, ఇరిగేషన్ ఏఈ లక్ష్మీనారాయణ తెలిపారు. ఇదిలా ఉండగా సున్నం చెరువు ఆక్రమణలకు నోటీసులు అందించేందుకు వెళ్లిన రెవెన్యు సిబ్బందితో కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన వారు వాగ్వివాదానికి దిగడం, గొడవ వాతావరణం తలెత్తడంతో సిబ్బంది వెనుదిరిగినట్టు సమాచారం.
- Tags
- Notices
Next Story






