- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పనిష్మెంట్ గా…వాట్సాప్ స్టేటస్
“ఈ రోజు హెల్మెట్ .. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడుపుతుండగా జీడిమెట్ల పోలీసులు పట్టుకున్నారు” అంటూ

దిశ, పేట్ బషీరాబాద్: “ఈ రోజు హెల్మెట్ .. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడుపుతుండగా జీడిమెట్ల పోలీసులు పట్టుకున్నారు” అంటూ వాట్సప్ స్టేటస్ పెట్టించి, ఉల్లంఘన చేసిన వారికి వినూత్నంగా అవేర్నెస్ కార్యక్రమం చేపట్టారు జీడిమెట్ల పోలీసులు. రోడ్డు ప్రమాదాలలో బాధితుల సంఖ్యను తగ్గించే ప్రయత్నంలో భాగంగా సీఐ గడ్డం మల్లేష్ ఆధ్వర్యంలో సోమవారం జీడిమెట్ల పోలీసులు స్పెషల్ రైడ్ నిర్వహించారు. ఇందులో భాగంగా హెల్మెట్ లేకుండా వెళ్తున్న వారిని ఆపి, వారికి హెల్మెట్ ప్రాముఖ్యతను తెలియజేశారు. అలాగే, పోలీసుల తనిఖీలలో పట్టుబడినట్లుగా ఫోటోతో పాటుగా “నేను హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నందువలన పోలీసులు పట్టుకున్నారు, భవిష్యత్తులో ఇలాంటి తప్పులను మరోసారి చేయను” అనే మెసేజ్ వారి వారి వాట్సాప్ స్టేటస్ లలో పెట్టించారు. చేసిన తప్పును తెలుసుకోవడంతో పాటుగా ఇతరులకు కూడా ఈ విషయంపై సరైన విధంగా అవగాహన కలగాలనే ఉద్దేశంతోనే ఈ తరహా అవేర్నెస్ క్యాంపెయిన్ చేసినట్లు సీఐ గడ్డం మల్లేష్ పేర్కొన్నారు.






