రామకృష్ణ మఠానికి 125 ఏళ్లు.. ఉత్సవాల్లో పాల్గొన్న మోడీ

by Mallepaka Hamsa |

రామకృష్ణ మఠాన్ని స్థాపించి నేటికి 125 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా తమిళనాడులోని చెన్నయ్ లో నిర్వహించిన ఉత్సవాల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు.

రామకృష్ణ మఠానికి 125 ఏళ్లు.. ఉత్సవాల్లో పాల్గొన్న మోడీ
X

దిశ, వెబ్ డెస్క్: రామకృష్ణ మఠాన్ని స్థాపించి నేటికి 125 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా తమిళనాడులోని చెన్నయ్ లో నిర్వహించిన ఉత్సవాల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘రామకృష్ణ మఠం అంటే నాకు చాలా గౌరవం. నా జీవితంలో ఆర్కే మఠం చాలా పెద్ద పాత్ర పోషించింది. నేను ఇవాళ ఉండటానికి రామకృష్ణ మఠం బోధనలు ఎంతో ఉపకరించాయి’’ అని మోడీ అన్నారు. అలాగే తమిళ ప్రజలు అంటే కూడా తనకు ఎంతో ఇష్టమని, ఇవాళ వాళ్ల మధ్యలో ఉండటం ఆనందంగా ఉందని అన్నారు. తమిళ సంస్కృతి చాలా గొప్పదని, చెన్నయ్ నగరానికి కూడా గొప్ప చరిత్ర ఉందని పీఎం మోడీ కొనియాడారు.

Next Story