బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బాకీ కార్డు ఉద్యమం

by velandi.Saikiran |

తెలంగాణలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టేందుకు బిఆర్ఎస్... కాంగ్రెస్ బాకీ కార్డు పేరుతో సోమవారం

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బాకీ కార్డు ఉద్యమం
X

దిశ, దుండిగల్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు బిఆర్ఎస్ పార్టీ సిద్ధమయ్యింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ బాకీ కార్డు పేరుతో సోమవారం బిఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శంబీపూర్ రాజు ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శంబీపూర్ రాజు మాట్లాడుతూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పులుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నయవంచక హామీలను ప్రజల్లో ఎండగట్టేందుకు బాకీ కార్డు ఉద్యమం చేప‌ట్టామ‌న్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితమైన వాగ్ధానాలు ప్రవేశపెట్టిందని ఆగ్ర‌హించారు. ఈ కార్యక్రమంలో ఎమ్యెల్యేలు సిహెచ్.మాల్లారెడ్డి,మర్రి రాజశేఖర్ రెడ్డి,మాధవరం కృష్ణా రావు, కె.పి.వివేకానంద, బండారి లక్ష్మారెడ్డి, మాల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జి రాగిడి లక్ష్మారెడ్డి, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Next Story