- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కడుపు కోతలోనూ ప్రాణదానం.. కొడుకు మృతి తరువాత నలుగురికి జీవదానం
ఇరవై ఏళ్లు అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్న కొడుకు చేతికి వస్తున్న సమయంలో అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోయాడు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇరవై ఏళ్లు అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్న కొడుకు చేతికి వస్తున్న సమయంలో అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోయాడు. తన కొడుకు మృతి చెందిన నలుగురి జీవితాలను కాపాడాలన్న ఆ తండ్రి సంకల్పంతో యువకుడు మరణించి నలుగురికి అవయవ దానం చేసి ప్రాణదాతగా నిలిచాడు. మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల, బుర్గుపల్లికి చెందిన కావలి నర్సింహులు కొడుకు కావలి శివప్రసాద్(22), ఈ మధ్య కాలంలో న్యాయ విద్య అభ్యసిస్తూ ఓ సీనియర్ లాయర్ వద్ద అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు.
ఈ నెల 17న నగరంలోని బల్కంపేట్ అమ్మవారి ఆలయం వద్ద జరిగిన ఓ గొడవలో ఓ వ్యక్తి పదునైన ఆయుధంతో శివ ప్రసాద్ పై దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయాల పాలైన శివ ప్రసాద్‌ను నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ఇదిలా ఉండగా చికిత్స పొందుతున్న శివ ప్రసాద్ 27న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు.
అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు కండ్ల ముందు విగత జీవిగా మారిన తట్టుకున్న శివ ప్రసాద్ తండ్రి నర్సింహులు తన కొడుకు మరణాంతరం పలువురికి ప్రాణదానం చేసి జీవించాలని అనుకున్నాడు. తన కొడుకు లివర్, లంగ్స్, కిడ్నీలను జీవన్ దాన్ సంస్థకు అప్పగించారు. దీంతో జీవన్ దాన్ సంస్థ వారు శివ ప్రసాద్ అవయవాలను నలుగురికి అందజేసి ప్రాణాలు కాపాడారు. పుట్టెడు దుఖంలోను శివ ప్రసాద్ తండ్రి నర్సింహులు తన కొడుకు అవయవాలను దానం చేసేందుకు తీసుకున్న నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.






