- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆసుపత్రికి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో దొంగతనం
ఆసుపత్రికి వెళ్లి వచ్చే సరికి ఇంట్లో సొత్తును దొంగలు ఎత్తుకెళ్లిన సంఘటన బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

దిశ, తిరుమలగిరి : ఆసుపత్రికి వెళ్లి వచ్చే సరికి ఇంట్లో సొత్తును దొంగలు ఎత్తుకెళ్లిన సంఘటన బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బోయినపల్లి డిఐ ఆనంద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చేపల వ్యాపారి పూస స్వామి తన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం గజ్వేల్ లోని ఆసుపత్రికి వెళ్లి సాయంత్రం 7గంటలకు ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి వచ్చేసరికి ఇంటికి వేసి ఉన్న తాళాలు పగలగొట్టడం చూసి ఖంగుతిన్నారు. వెంటనే లోపలికి వెళ్లి చూసేసరికి ఇంట్లో బీరువాలో బట్టలు, వస్తువులు చిందరవందరంగా పడి ఉండడం గమనించిన కుటుంబ సభ్యులు ఇంట్లో చోరీ జరిగిందని గ్రహించి వెంటనే బోయినపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఇంట్లో ఉన్న 4లక్షల నగదుతో పాటు ఐదున్నర తులాలబంగారం, 19తులల వెండి చోరీకి గురైనట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి డాగ్స్ స్క్వాడ్,క్లూస్ టీమ్ సహాయంతో దర్యాప్తు చేపట్టారు. బాధితుని ఇంట్లో బంగారం డబ్బు నగదు ఉంటాయని బాగా తెలిసిన వారి పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు.






