- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థుల ఇబ్బందులు తొలగించిన అధికారులు
బాలానగర్ చెరబండ రాజు నగర్‌లో నూతన పాఠశాల నిర్మాణం సందర్భంగా నాలా కాల్వపై ఉన్న శిథిలాలు, మట్టి, వ్యర్థాలను పాఠశాల పక్కనే డంప్ చేయడంతో విద్యార్థులు, కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

దిశ, బాలానగర్ : బాలానగర్ చెరబండ రాజు నగర్‌లో నూతన పాఠశాల నిర్మాణం సందర్భంగా నాలా కాల్వపై ఉన్న శిథిలాలు, మట్టి, వ్యర్థాలను పాఠశాల పక్కనే డంప్ చేయడంతో విద్యార్థులు, కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను కూకట్‌పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి బండి రమేష్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన సూచనల మేరకు బాలానగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మట్టే ప్రసన్న కుమార్ జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన జీహెచ్ఎంసీ అధికారులు తక్షణ చర్యలు చేపట్టి నిర్మాణ వ్యర్థాలను తొలగించారు. సమస్య పరిష్కారానికి స్పందించిన అధికారులకు మట్టే ప్రసన్న కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన పరిపాలనా మార్పులు, ‘ప్రజావాణి’ కార్యక్రమం వల్ల ప్రజా సమస్యలు వేగంగా పరిష్కారమవుతున్నాయని పేర్కొన్నారు.






