- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేడ్చల్ లో నూతన కోర్టు హాల్ ప్రారంభం
మేడ్చల్ జిల్లా కోర్టు ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన జిల్లా, సెషన్ కోర్టు హాల్‌ను శనివారం ఘనంగా ప్రారంభించారు.

దిశ, మేడ్చల్ : మేడ్చల్ జిల్లా కోర్టు ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన జిల్లా, సెషన్ కోర్టు హాల్‌ను శనివారం ఘనంగా ప్రారంభించారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు రిబ్బన్ కత్తిరించి కోర్టు హాల్‌ను ప్రారంభించారు. జస్టిస్ కె. లక్ష్మణ్, జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి, జస్టిస్ నందికొండ నర్సింగరావు, మేడ్చల్ కలెక్టర్ మను చౌదరి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన నిర్వహించి సాంప్రదాయబద్ధంగా ప్రారంభించారు. అనంతరం నూతన కోర్టు హాల్‌లోని సౌకర్యాలు, న్యాయమూర్తుల ఛాంబర్లను పరిశీలించారు. 7పెరుగుతున్న కేసుల దృష్ట్యా న్యాయవాదులు, కక్షిదారులకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు న్యాయ ప్రక్రియను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ హాల్‌ను నిర్మించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయాధికారులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, పోలీసు అధికారులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.






