ఏసీబీ వలలో మూసాపేట్​ సర్కిల్​ సీఓ మురళి

by Ratna Kumari |   (  Updated:2026-03-10 14:52:14  IST  )

పొదుపు సంఘాల మహిళలకు రుణాలు మంజూరు చేయించినందుకు లంచం డిమాండ్​ చేసి రూ.18వేలు లంచం తీసుకుంటుండగా మూసాపేట్​ సర్కిల్​ సీఓ (కమ్యునిటి ఆర్గనైజర్​)ను ఏసీబీ అధికారులు మంగళవారం రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

ఏసీబీ వలలో మూసాపేట్​ సర్కిల్​ సీఓ మురళి
X

దిశ, కూకట్​పల్లి : పొదుపు సంఘాల మహిళలకు రుణాలు మంజూరు చేయించినందుకు లంచం డిమాండ్​ చేసి రూ.18వేలు లంచం తీసుకుంటుండగా మూసాపేట్​ సర్కిల్​ సీఓ (కమ్యునిటి ఆర్గనైజర్​)ను ఏసీబి అధికారులు మంగళవారం రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. రంగారెడ్డి రేంజ్​ డీఎస్పీ ఆనంద్​ కమార్​ తెలిపిన వివరాల ప్రకారం.. మూసాపేట్​ సర్కిల్, మూసాపేట్​ డివిజన్​ పరిధిలోని స్వయం సహాయక గ్రూప్​ మహిళలకు ఒక్కోక్కరికి రూ. 2 లక్షలు చొప్పున మంజూరు అయిన 20 లక్షల రూపాయల రుణంలో నుంచి తనకు పది శాతం కమిషన్​ లంచంగా ఇవ్వాలని, కమ్యునిటి ఆర్గనైజర్​గా పని చేస్తున్న మురళి పొదుపు సంఘం మహిళలను డిమాండ్​ చేశాడు. అంత ఇచ్చుకోలేము అంటే.. చివరిగా 18 వేలు ఇవ్వాల్సిందే అంటు డిమాండ్​ చేశాడు. దీంతో ఆ మహిళలు ఏసీబీ అధికారులన ఆశ్రయించారు. దీంతో ఏసీబి అధికారులు మురళి 18 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

Next Story