- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వామ్యం కావాలి
పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వామ్యం కావాలని ఘట్కేసర్ మున్సిపాలిటీ కమిషనర్ పంజాల రాజేష్ అన్నారు. స్ఫూర్తి

దిశ, ఘట్కేసర్ః పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వామ్యం కావాలని ఘట్కేసర్ మున్సిపాలిటీ కమిషనర్ పంజాల రాజేష్ అన్నారు. స్ఫూర్తి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో "శాస్త్రీయ ఆలోచనతో సామాజిక మార్పు కోసం మనం" కార్యక్రమంలో భాగంగా బుధవారం ఘట్కేసర్ పట్టణం లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పర్యావరణాన్ని పదిల పరుద్దాం.. భవిష్యత్తుకు భరోసా నిద్దాం కార్యక్రమానికి మున్సిపాలిటీ కమిషనర్ పంజాల రాజేష్ ముఖ్య అతిధిగా హాజరై పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సామాజిక శ్రేయస్సు కోసం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ నివారణకు కృషి చేయాలని పేర్కొన్నారు.
ప్రతి పౌరుడు బాధ్యతగా ప్రతిజ్ఞ తీసుకొని ముందుకు సాగినప్పుడే ప్లాస్టిక్ రహిత సమాజం సాద్యమని అన్నారు. బహిరంగ ప్రదేశాలలో వేసిన చెత్త, లేదా ఇతర వ్యర్థాలను కాల్చడం వలన విషవాయువులు వెలువడి అనారోగ్యాల బారిన పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంతకు ముందు స్ఫూర్తి ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కుంటోళ్ళ యాదయ్య, మున్సిపాలిటీ మేనేజర్ సతీష్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ వేనుగోపాల్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయ లక్ష్మీ, స్ఫూర్తి ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి కంది సత్యనారాయణ, సభ్యులు వరికుప్పల లింగస్వామి, పరుశురాం, మున్సిపాలిటీ సిబ్బంది, విద్యార్థులు, ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.






