సాయన్న నిస్వార్ధపరుడు: ఎమ్మార్పీఎస్ నేతలు

by S Gopi |

కంటోన్మెంట్ లో ప్రజలకు ఎమ్మెల్యే సాయన్న చేసిన సేవలు మరువలేనివని, ఆయన... MRPS Leaders consoled Sayanna Family Members

సాయన్న నిస్వార్ధపరుడు: ఎమ్మార్పీఎస్ నేతలు
X

దిశ, కంటోన్మెంట్/బోయిన్ పల్లి: కంటోన్మెంట్ లో ప్రజలకు ఎమ్మెల్యే సాయన్న చేసిన సేవలు మరువలేనివని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ కంటోన్మెంట్ ఇంచార్జ్ ఇటుక శ్రీకిషన్ మాదిగ తెలిపారు. శనివారం కార్ఖనలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సాయన్న కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన చిత్రప టానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు అజిత్ కళ్యాణ్, మంద మధుకర్ మాదిగ, కాంపల్లి శ్రీకాంత్, ఇమ్రాన్ ఖాన్ పాల్గొన్నారు.

Next Story