శంభీపూర్ రాజు ఫోన్ హ్యాక్..పోలీసులు కీల‌క ప్ర‌క‌ట‌న‌

by velandi.Saikiran |

ఎమ్యెల్సీ శంభీపూర్ రాజు ఫోన్ హ్యాకింగ్ జరిగినట్లు దుండిగల్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం

శంభీపూర్ రాజు ఫోన్ హ్యాక్..పోలీసులు కీల‌క ప్ర‌క‌ట‌న‌
X

దిశ, దుండిగల్: ప్రజా ప్రతినిధుల ఫోన్ హ్యాకింగ్ వ్యవహారం పోలీసుల‌కు సవాల్ గా మారింది. తాజాగా మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్యెల్సీ శంభీపూర్ రాజు ఫోన్ హ్యాకింగ్ జరిగినట్లు దుండిగల్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. గత కొంత కాలంగా తన ఫోన్ హ్యాకింగ్ చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అనుమానిత అలర్ట్స్, వార్నింగ్స్ వస్తున్నాయన్నారు. నేరస్తులను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేసారు. ఇక దీనిపై ద‌ర్యాప్తు చేసుకుని, ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ బాల రెడ్డి తెలిపారు.

Next Story