MLA Shri Ganesh : ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..

by Chintha Aamani |

ప్రజా సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని

MLA Shri Ganesh : ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..
X

దిశ,కంటోన్మెంట్ : ప్రజా సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. గురువారం బొల్లారం లో ఎమ్మెల్యే పర్యటించారు.ముందుగా సాయిబాబా మందిరంలో బాబాను దర్శించుకుని కంటోన్మెంట్ ప్రజలంతా చల్లగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు...అనంతరం వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఓం సాయి కాలనీలో రాత్రిపూట పాములు ఇంట్లోకి వస్తున్నాయని, స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ను కోరారు. దీంతో శ్రీ గణేష్ విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి స్ట్రీట్ లైట్స్ త్వరగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కంటోన్మెంట్ బోర్డు సీఈవో మధుకర్ నాయక్ తో మాట్లాడుతూ బొల్లారంలో సమస్యలు చాలా ఉన్నాయని పరిష్కరించాలని కోరగా, సిఈఓ సానుకూలంగా స్పందించినట్లు శ్రీ గణేష్ తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Next Story