- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేరులో అభివృద్ది కాదు.. ఆచరణలో చూపడం ముఖ్యం: ఎమ్మెల్యే
మల్కాజిగిరి నియోజకవర్గం అభివృద్దికి అన్ని వేళల కృషిచేస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు.

X
దిశ, అల్వాల్: మల్కాజిగిరి నియోజకవర్గం అభివృద్దికి అన్ని వేళల కృషిచేస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం తుర్కపల్లి 190 డివిజన్ బొల్లారం బృందావన్ కాలనీ వద్దగల హిందూ స్మశాన వాటిక అభివృద్దికి గాను రూ.17 లక్షలతో య్యయంతో బంధం బావి వద్ద 48.5 వ్యయంతో ముస్లీం (కబరిస్తాన్) అభివృద్ది పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేరులో అభివృద్ది చూపడం కాదు ఆచరణలో చూపడం ముఖ్యమని అన్నారు. రానున్న రోజులలో అభివృద్ది అంటే మల్కాజిగిరి గుర్తుకు వచ్చేలా చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు డోలి రమేష్, మంద శోభన్ బాబు, పవన్, డివిజన్ నాయకులు భాస్కర్ రెడ్డి, మహేష్, దేవేందర్, రాము, శ్రీనివాస్, ఫిరోజ్, గణేష్, రహమత్ ఖాన్, ఆరీఫ్, అతిక్ పాషా, శ్రీదేవి, వర్ష, శిల్పా పాల్గొన్నారు.
Next Story






