బీఆర్ఎస్ కార్యకర్త మృతి..మర్రి రాజశేఖర్ రెడ్డి నివాళులు

by velandi.Saikiran |

వెంకటాపురం డివిజన్‌కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బాలకృష్ణ (బాలి) మృతి చెందాడు. ఈ సంఘ‌ట‌న‌ తెలిసిన

బీఆర్ఎస్ కార్యకర్త మృతి..మర్రి రాజశేఖర్ రెడ్డి నివాళులు
X

దిశ: అల్వాల్: వెంకటాపురం డివిజన్‌కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బాలకృష్ణ (బాలి) మృతి చెందాడు. ఈ సంఘ‌ట‌న‌ తెలిసిన వెంటనే హుటాహుటిన బాలకృష్ణ నివాసానికి చేరుకున్నారు మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. బాలకృష్ణ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీకి బాలకృష్ణ దీర్ఘకాలం పాటు విశ్వసనీయ నాయకుడిగా సేవలందించారని, ఆయన మరణం పార్టీకి, స్థానిక ప్రజలకు తీరని లోటు అని పేర్కొన్నారు. బాలకృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్, శంకర్, స్థానిక బస్తీ వాసులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story