- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > మేడ్చల్ > నీటి శుద్ధికి ఎస్టీపీ ప్లాంట్ల నిర్మాణం.. MLA మాధవరం కృష్ణారావు
నీటి శుద్ధికి ఎస్టీపీ ప్లాంట్ల నిర్మాణం.. MLA మాధవరం కృష్ణారావు
చెరువులలో నీటిని శుద్ధి చేసేందుకు ఎస్టీపీ ప్లాంట్లను నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.

X
దిశ, కూకట్పల్లి: చెరువులలో నీటిని శుద్ధి చేసేందుకు ఎస్టీపీ ప్లాంట్లను నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బాలాజీనగర్ డివిజన్ పరిధిలోని రేయిన్బో విస్తాస్ వద్ద నిర్మిస్తున్న ఎస్టీపీ ప్లాంట్ పనులను ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని చెరువులలోని నీటిని శుద్ధి చేసేందుకు కోట్లాది రూపాయల వ్యయంతో ఎస్టీపీ ప్లాంట్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేస్తున్నామని అన్నారు. చెరువులలో నీటిని శుద్ధి చేయడంతో దోమలు, మురుగునీటి సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పగుడాల బాబురావు, డివిజన్ అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Next Story






