బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ ప్రతినిధితో ఎమ్మెల్యే బండారి భేటీ

by Taduka Kalyani |

బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ ప్రతినిధి నళిని రఘురామన్ తో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి బుధవారం భేటీ అయ్యారు.

బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ ప్రతినిధితో ఎమ్మెల్యే బండారి భేటీ
X

దిశ , కాప్రా: బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ ప్రతినిధి నళిని రఘురామన్ తో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన విద్యార్థులకు సంబంధించిన వీసా అంశాలు, ఉన్నత విద్య, కల్పిస్తున్న అవకాశాలు, అక్కడ ఉన్న విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార అంశాలపై చర్చించారు. భవిష్యత్తులో ఇక్కడి విద్యార్థులకు మరింత సహకారం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు. దీనికి ఆమె స్పందిస్తూ... విద్యార్థుల వీసా, ఉన్నత విద్య, విద్యార్థులకు కావలసిన సౌకర్యాలను పూర్తిస్థాయిలో కల్పించేలా ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు.

Next Story