మేనేజర్‌పై తల్వార్‌తో దాడి చేసిన పాల వ్యాపారి..

by Kodari Anjali |   (  Updated:2026-01-08 02:35:12  IST  )

కీసర ప్రధాన కూడలిలో తెల్లవారుజామున మిల్క్ మేనేజర్ దొడ్ల శ్రీనివాస్‌పై కిరణ్ అనే పాల వ్యాపారి తల్వార్‌తో దాడి చేశాడు.

మేనేజర్‌పై తల్వార్‌తో దాడి చేసిన పాల వ్యాపారి..
X

దిశ, కీసర: కీసర ప్రధాన కూడలిలో తెల్లవారుజామున దొడ్ల మిల్క్ మేనేజర్ శ్రీనివాస్‌పై కిరణ్ అనే పాల వ్యాపారి తల్వార్‌తో దాడి చేశాడు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం నగరంలోని శ్రీకర హాస్పిటల్‌కి తరలించారు. పోలీసులు శ్రీనివాస్‌ను మౌలాలి వాసిగా గుర్తించారు. ప్రస్తుతం నిందితుడి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.ఇక పాల వ్యాపారి కిరణ్ గత కొంత కాలంగా పాల వ్యాపారం చేస్తూ దొడ్ల కంపెనీకి బకాయి ఉన్నాడు. అట్టి బకాయి వసూళ్ల విషయంలో శ్రీనివాస్‌కి, కిరణ్‌కి మధ్య గొడవ జరిగింది.ఇదే విషయంపై ఈ రోజు తెల్లవారుజామున శ్రీనివాస్ కీసరకు వచ్చాడు. కిరణ్‌కి పాలు వేయకూడదు అని వ్యాన్ డ్రైవర్‌కి చెప్పాడు. దీంతో కిరణ్‌కి, శ్రీనివాస్‌కి మధ్య గొడవ జరగడంతో.. ఈ క్రమంలో కిరణ్ తల్వార్‌తో శ్రీనివాస్‌పై దాడి చేశాడు.

Read More..

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు స్పాట్ డెడ్

Next Story