రేపే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు

by Dishafeatures2 |
రేపే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామని మేడ్చల్ మల్కాజ్ గిరి కలెక్టర్ అమోయ్ కుమార్ పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆదివారం ఎన్నికల అధికారులకు ఎన్నిక సామగ్రిని అందచేసే సందర్భంలో ఆయన అక్కడి ఏర్పాట్లు పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ఎన్నికల నిర్వహణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

జిల్లాలో 14 పోలింగ్ కేంద్రాలు

మేడ్చల్ జిల్లాల్లో ఉపాధ్యాయ ఎం ఎల్ సి నిర్వహణ కోసం మొత్తం 14 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. వీటిలో జిల్లా వ్యాప్తంగా ఉన్న 6 వేల 536 మంది ఓటర్లు ఉండగా వీరిలో 3 వేల 498 మహిళ, 3 వేల 38 పురుష ఓటర్లు ఉన్నారు. వెబ్ కాస్టింగ్ ద్వారా నిరంతరంగా ఓటింగ్ ప్రక్రియను పరిశీలించనున్నారు అధికారులు. ఓటింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్ లను సరూర్ నగర్ స్టేడియం లో కట్టుదిట్టమైన భద్రత నడుమ భద్రపరచిననున్నారు.

రేపు సెలవు

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జిల్లాలో ఉన్న 14 పోలింగ్ కేంద్రాలు ఉన్న పాఠశాలలకు ఎన్నికల కమిషన్ సూచనల మేరకు సెలవు ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

రేపటి ప్రజావాణి రద్దు

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 13న కలెక్టరేట్ లో ప్రజావాణి ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ అమోయ్ కుమార్ తెలిపారు.మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జిల్లాలో ఈనెల 13న సోమవారం జరగనున్న నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించలేకపోతున్నామని ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. ప్రజలు సోమవారం రోజున కలెక్టరేట్కు వచ్చి ఇబ్బందులు పడకూడదని కలెక్టర్ అమోయ్ కుమార్ కోరారు.


Next Story

Most Viewed