- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిమజ్జనం సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలి - అదనపు కలెక్టర్
గణేష్ నిమజ్జనానికి ఎటువంటి ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేయాలని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్త అధికారులకు

దిశ, నాగారం: గణేష్ నిమజ్జనానికి ఎటువంటి ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేయాలని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్త అధికారులకు సూచించారు. బుధవారం నాగారం మున్సిపల్ పరిధిలోని రాంపల్లి చెరువు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ భాస్కర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ముఖ్యంగా రానున్న మూడు రోజుల్లో అధిక సంఖ్యలో గణేష్ విగ్రహాల నిమజ్జనం జరగనుండటంతో, నిమజ్జన ఏర్పాట్లను సమీక్షించారు. గణేష్ విగ్రహాల ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేయాలన్నారు. నిమజ్జన కార్యక్రమం సజావుగా, సురక్షితంగా జరిగేలా చూడాలని సంబంధిత విభాగాలకు ఆదేశించారు. ప్రజల సౌకర్యం, రహదారి రవాణా, భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్వో బి. నాగేశ్వర్ రావు, డిప్యూటీ ఇంజనీర్ టి. సంతోష్ కుమార్ పాల్గొన్నారు.






