- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజా సంక్షేమమే ప్రధాన ఎజెండా
ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ పథకాలు అర్హులైన లబ్దిదారులకు అందేలా ప్రత్యేకమైన కార్యచరణతో పనిచేస్తున్నట్లు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి అన్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.

దిశ, మేడ్చల్ బ్యూరో : ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ పథకాలు అర్హులైన లబ్దిదారులకు అందేలా ప్రత్యేకమైన కార్యచరణతో పనిచేస్తున్నట్లు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి అన్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలలో మౌలిక వసతుల కల్పన, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో సదుపాయాల ఏర్పాట్లు, ఎలివేటెడ్ కారిడార్ పురోగతి తదితర అంశాలపై శనివారం కలెక్టర్ తన కార్యాలయంలో ‘దిశ’ ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
అంగన్‌వాడీల ఆధునీకరణ..
ఆహ్లదకరమైన వాతావరణంలో అంగన్‌వాడీ కేంద్రాలు ఉండేలా సౌకర్యాలను కల్పిస్తున్నాం. చిన్నారులు, గర్బిణిలు, బాలింతలకు పౌష్టికాహారం అందించడంతో పాటు చిన్నారులకు ఆటపాటలతో విద్యను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భగంగా వీటిని మరింత బలోపేతం చేస్తుస్తూ ‘ప్రీ ప్రైమరీ స్కూళ్లు’గా తీర్చిదిద్దుతున్నాం. జిల్లాలో మొత్తం 793 అంగన్‌వాడీలుండగా, సొంత భవనాల్లో కొనసాగుతున్న 222 అంగన్‌వాడీలను ముందుగా ఆధునీకరిస్తున్నాం. వీటిలో 110 సెంటర్లకు పెయింటింగ్ పూర్తి చేయగా, మరో 269 సెంటర్లలో పెయింటింగ్ పనులు ప్రారంభమయ్యాయి. సొంత బిల్డింగ్‌లకు రిపేర్లు చేయించి, ఆవి ఆకట్టుకునేలా కలర్స్ వేయిస్తున్నాం. విద్యార్థులు కేంద్రంలో ఉల్లాసంగా ఉండే విధంగా గోడలై పక్షులు, ఇంద్ర ధనుస్సు తదితర బొమ్మలను వేయిస్తున్నాం. పిల్లలు ఆడుకోవడానికి ఇండోర్, అవుట్ డోర్ ఆట వస్తువులను సమకూరుస్తున్నాం. డ్రింకింగ్ వాటర్ కనెక్షన్లతో పాటు టాయిలెట్స్‌ను ఏర్పాటు చేయిస్తున్నాం. కిచెన్ రూమ్స్‌కు గాలి, వెలుతురు బాగా వచ్చే విధంగా కిటికీలు, ఇనుప జాలీలు ఏర్పాటు చేయిస్తున్నాం. ఫ్యాన్లు, లైట్లు, టెలీవిజన్‌ల సమాకుర్చుతున్నాం. న్యూట్రీ గార్డెన్‌లను ఏర్పాటు చేయిస్తున్నాం. వాటర్ ప్యూరీఫైడ్ యంత్రాలను ఏర్పాటు చేయిస్తున్నాం. మరోవైపు గవర్నమెంట్ స్కూల్స్ ఆవరణలో ఉన్న వాటిని మోడల్ అంగన్‌వాడీలుగా గుర్తించి ఫర్నీచర్ అందజేస్తున్నాం. ఇప్పటికే అంగన్‌వాడీ టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా పిల్లలకు ఏ నెలలో ఏం బోధించాలో సూచిస్తూ రెండు రకాల బుక్స్‌తో పాటు యూనిఫామ్ అందజేశాం. కార్పొరేట్ ప్రీ ప్రైమరీ స్కూళ్లకు ఏమాత్రం తీసిపోకుండా అంగన్‌వాడీ కేంద్రాలను తీర్చిదిద్దుతున్నాం.
డబుల్ బెడ్ రూమ్‌ల నిర్వహణపై..
జిల్లాలో డబుల్ బెడ్ రూమ్స్ 20 లొకేషన్లలో 30 వేల 68 ఇండ్లు ఉన్నాయి. వీటిలో 29,128 ఇండ్లను లబ్దిదారులకు పంపిణీ చేయగా, మరో 940 ఖాళీలు ఉన్నాయి. అయితే మిగిలిపోయిన ఇండ్లను లిస్ట్- 2 కింద ఉన్న అర్హులకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో సరైన వసతులు లేవని దృష్టికి రావడంతో వాటి పరిష్కారానికి ప్రత్యేక కార్యచరణతో ముందుకు వెళ్లుతున్నాం. లబ్దిదారులతో కలిసి ‘రెసిడెన్షియల్ వెల్ఫేర్ సోసైటీ’లను ఏర్పాటు చేయిస్తున్నాం. సొసైటీ సభ్యులు ముందుండి మౌలిక వసతుల కల్పనకు కృషి చేసేలా ప్రోత్సహిస్తున్నాం. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో మంచినీటి, డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తున్నాం. ఏమైనా మరమ్మతులు, లిప్టు రిపేయిర్ల వంటి సమస్యలుంటే సొసైటీ సభ్యులు పరిష్కించాలని సూచిస్తున్నాం. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో సొసైటీలు ఏర్పడ్డాయి. ఇకపోతే 2 వేలకు పైగా జనాభ ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే 7 లొకేషన్లలో అంగన్‌వాడీ కేంద్రాలు, హెల్త్ సెంటర్లు, ప్రైమరీ స్కూళ్లతో పాటు 11 సెంటర్లలో రేషన్ షాపులను డబుల్ బెడ్ రూమ్ ప్రాంగణాల్లో ఏర్పాటు చేయించాం. ఎక్కడైనా రేషన్ షాపులలో కార్డు హోల్డర్లు తక్కువగా ఉంటే సమీపంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ప్రాంగణాల్లోకి రేషన్ షాపులను తరలించి, అక్కడున్న అర్హులకు కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయిస్తున్నాం. లబ్దిదారులకు కనీస మౌలిక వసతులను కల్పించేందకు శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నాం.
ఎలివేటెడ్ కారిడార్లపైన..
జిల్లాలో రెండు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే మేడ్చల్ హైవే(ఎన్‌హెచ్ 44)లో కారిడార్ పనులు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ నుంచి శామీర్‌పేట వరకు నిర్మించనున్న కారిడార్ పనులను త్వరలోనే ప్రారంభించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. కేంద్ర రక్షణ శాఖ భూములను సైతం కారిడార్ నిర్మాణ పనుల కోసం ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే ప్రైవేట్ ప్రాపర్టీలు కోల్పోతున్న వారు కొందరు కోర్టును ఆశ్రయించడంతో భూ నిర్వాసితులకు అవార్డు ఇవ్వలేకపోతున్నాం. కోర్టు తీర్పు రాగానే భూ నిర్వాసితులకు అవార్డులను అందజేసి, ఎలివేటెడ్ కారిడార్ పనులను ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.






