- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
8న ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల ముట్టడి
జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ పిలుపుమేరకు ఈనెల 8న జిల్లాలోని అన్ని ఎమ్మెల్యే క్యాంపు

దిశ, ఘట్కేసర్ః జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ పిలుపుమేరకు ఈనెల 8న జిల్లాలోని అన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను మాల మహానాడు ఆధ్వర్యంలో ముట్టడి విజయవంతం చేయాలని మేడ్చల్ జిల్లా కన్వీనర్ గుజ్జుక పరుశురాం కోరారు. బుధవారం ఘట్కేసర్ పట్టణ కేంద్రంలో జాతీయ మాల మహానాడు మున్సిపల్ అధ్యక్షులు ఎజ్జల రఘు, మండల ప్రధాన కార్యదర్శి గుమ్మడి మురళి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా కన్వీనర్ గుజ్జుక పరుశురాం, ఉపాధ్యక్షులు పడిగం ఆంజనేయులు హాజరై మాట్లాడారు.
జీవో 99 తీసుకువచ్చి మాల విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని సర్కార్ పెద్దలపై ఫైర్ అయ్యారు. ఎస్సీ వర్గీకరణ జీవో 99లో అందరి ఎమ్మెల్యే ల భాగస్వామ్యం ఉందని విమర్శించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి జీవో 99 వెనక్కి తీసుకోవాలని, రోస్టర్ పాయింట్లు 22 నుంచి 1 పాయింట్ కు తగ్గించాలని డిమాండ్ చేసారు. జీవోను 99 ను సవరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పడిగం ప్రవీణ్ , టి.రాములు, గుమ్మడి రాము, ఈసామ్ మధు, పర్నాటి సాయికిరణ్, గుమ్మడి అనిల్, ఎస్ బద్రి,, మంతూరీ గోపి, తదితరులు పాల్గొన్నారు.






