మైనంప‌ల్లి ప్ర‌త్యేక చొరువ‌తోనే కాల‌నీల అభివృద్ధి

by Ratna Kumari |

మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రత్యేక చొరవతోనే మచ్చ బొల్లారం పూర్వ డివిజన్ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ అన్నారు.

మైనంప‌ల్లి ప్ర‌త్యేక చొరువ‌తోనే కాల‌నీల అభివృద్ధి
X

దిశ, అల్వాల్ : మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రత్యేక చొరవతోనే మచ్చ బొల్లారం పూర్వ డివిజన్ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ అన్నారు. శుక్రవారం నూతన డివిజన్ తుర్కపల్లిలోని వెంకన్న కాలనీ, సాయి సూర్య కాలనీలో రూ.20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి లోటు రాకుండా మైనంపల్లి హనుమంతరావు సహకారంతో నేటి వరకు ముందు వరుసలో నిలిపామ‌ని తెలిపారు. రాబోయే రోజులలో సైతం అదే ఒరవడిని కొనసాగించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కాలునీల ప్రెసిడెంట్లు సందీప్ రెడ్డి, సురేందర్ రెడ్డి, సాన సురేందర్, భాస్కర్ రెడ్డి, లక్ష్మీనారాయణ, ఆగమయ్య రెడ్డి, లడ్డు రెడ్డి, దిండ్ల స్వామి, బొబ్బిలి సురేందర్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, రాజేందర్ యాదవ్, ఆనంద్, సంపత్ యాదవ్, బబ్లు, నవీన్, వెంకటేష్, రాజేందర్ పాల్గొన్నారు.

Next Story