- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ అభ్యర్థి నేనే... గెలిచేది కూడా నేనే
by S Gopi |
వచ్చే కంటోన్మెంట్ బోర్డ్ ఎన్నికల్లో తాను బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏడో వార్డు నుండి... Latest News

X
దిశ, కంటోన్మెంట్/బోయిన్ పల్లి: వచ్చే కంటోన్మెంట్ బోర్డ్ ఎన్నికల్లో తాను బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏడో వార్డు నుండి బరిలో ఉంటానని నాగినేని సరిత అన్నారు. తమ కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు, సాయన్న ఆశీస్సులతో భారీ మెజారిటీతో గెలపొందుతానని ఏడవ వార్డు మహిళా అధ్యక్షురాలు నాగినేని సరిత ధీమా వ్యక్తం చేశారు. గురువారం తిరుమలగిరిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకురుల సమావేశంలో మాట్లాడుతూ.. తాను దివంగత ఎమ్మెల్యే సాయన్న సహకారంతో ఏడవ వార్డులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశానన్నారు. రోడ్లు, వీధి దీపాలు, ప్రభుత్వ పథకాలు అందజేయడంలో నిరుపేద ప్రజలకు ఎంతో సహాయ సహకారం చేశానని ఆమె తెలిపారు. నేటి నుండి ప్రజల్లోకి వెళ్తానని అన్నారు. ఈసారి తన విజయం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
Next Story






