సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం

by velandi.Saikiran |

సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరం అని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు.

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం
X

దిశ, కుత్బుల్లాపూర్ : సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరం అని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన వేముల సత్యనారాయణ, కుర్ర మని శేఖర్ గౌడ్, మాధగుంట లక్ష్మీ లు అనారోగ్యంతో బాధపడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ సహాయం కోసం మాజీ ఎమ్మెల్యే కూనను ఆశ్రయించారు. వీరి సమస్యలు తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కూన సరైన వైద్యం నిమిత్తం ఆర్థిక సహాయం అందించేందుకు గాను సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులకు సిపారసు చేశాడు. వైద్య సహాయం కోసం మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన సోమవారం తన నివాసంలో అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రతీ పేద వాడికి న్యాయం జరిగేలా చూడాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యం అని కొనియాడారు. కార్యక్రమంలో లబ్ధిదారులు బైరి శివ కుమార్ గౌడ్, కూన రాఘవేంద్ర గౌడ్, కృష్ణ యాదవ్, జిమ్ వేణు, మహేందర్ రెడ్డి, మాక్బూల్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

Next Story