- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కీసరలో రోడ్డు వేయండి లేదా రహదారినీ ఓపెన్ చేయండి !
దమ్మాయిగూడ మున్సిపాలిటీ కీసరలో గత కొన్ని రోజులుగా బోగారం వైపు వెళ్ళే రహదారి వర్షానికి పాడైపోయింది. ద్విచక్రవాహనంపై

దిశ, కీసర : దమ్మాయిగూడ మున్సిపాలిటీ కీసరలో గత కొన్ని రోజులుగా బోగారం వైపు వెళ్ళే రహదారి వర్షానికి పాడైపోయింది. ద్విచక్రవాహనంపై వెళ్ళే పలువురు పలు సార్లు కింద పడిపోయి గాయాలు కూడా అయ్యాయి. కీసర వార్డు కార్యాలయంలో ఉన్న మున్సిపల్ అధికారుల దృష్టికి రోడ్డు పాడైపోయింది కనీసం కాస్తంత మట్టి పోయండి అని స్థానికులు ఎంత మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు.ఎట్టకేలకు మున్సిపల్ కమిషనర్ స్పందించి సోమవారం ఉదయం రోడ్డు వేస్తాం అంటు ఎస్టిమేట్ చూసుకొని రెండు దిక్కుల రహదారిని ముసి వేశారు.
కానీ సాయంత్రం అయిన కాంక్రీట్ రాలేదు రోడ్డు అంటూ వేయలేదు అని అక్కడ ఉన్న ప్రజలు విచారణ వ్యక్తం చేశారు.దసరా పండుగ వేళ పూవులు పండ్లు అమ్ముకునే వారికి చాలా ఇబ్బంది అవుతుంది రోడ్డు అయిన వేయండి లేదా రహదారి అయిన ఓపెన్ చేయండి అంటూ వ్యాపారులు మున్సిపల్ అధికారులను వేడుకుంటున్నారు. మున్సిపల్ వార్డు అధికారులను వివరణ కోరగా బోగారం వైపు వెళ్ళే రోడ్డును వేస్తాము అని రెండు వైపుల రహదారి నిలిపివేయడం వస్తవే అలాగే ఎంత కాంక్రీట్ పడుతుంది అని ఎస్టిమేట్ చేయడం కూడా జరిగింది.కానీ కాంక్రీట్ వేయాలి అంటే ఎక్కువ ఖర్చు అవుతుంది అని కంకర సిమెంట్ కలిపి వేయాలి అని ఆలోచనతో సోమవారం రోడ్డు వేయకుండా ఆపాల్సి వచ్చిందన్నారు.






