కవిత, సీఎం రేవంత్​ భూ కుంభ‌కోణంపై విచారణ చేయాలి

by velandi.Saikiran |

కల్వకుంట్ల కవిత, ఆమె భర్త అనిల్​, సీఎం రేవంత్​ రెడ్డి బినామీ ఏవి రెడ్డితో కలిసి బాలానగర్​ మండల పరిధిలోని వేల కోట్ల విలువ చేసే 20 ఎకరాల

కవిత, సీఎం రేవంత్​ భూ కుంభ‌కోణంపై విచారణ చేయాలి
X

దిశ, కూకట్​పల్లి: కల్వకుంట్ల కవిత, ఆమె భర్త అనిల్​, సీఎం రేవంత్​ రెడ్డి బినామీ ఏవి రెడ్డితో కలిసి బాలానగర్​ మండల పరిధిలోని వేల కోట్ల విలువ చేసే 20 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేస్తున్నారని స్థానికులు శుక్రవారం మల్కాజిగిరి ఎంపి ఈటల రాజేందర్​ను కలిసి విన్నవించారు. కల్వ కుంట్ల కవిత భర్త అనిల్​ పేరుతో తప్పుడు పత్రాలను సృష్టించి, బాలానగర్​ మండల పరిధిలోని ఐడిపిఎల్​కు చెందిన సర్వే నంబర్​ 2010/4లోని 20 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని పేర్కొన్నారు.

సీఎం రేవంత్​ రెడ్డి బినామి ఏవి రెడ్డితో ఈ ప‌ని చేసిన‌ట్లు తెలిపారు. ఓవర్​లాపింగ్​ అయిన సర్వే నంబర్ల‌ను ఆధారంగా చేసుకుని భూ కబ్జా పర్వాన్ని నడిపించారని ఆరోప‌ణ‌లు చేశారు. తప్పుడు పత్రాలను సృష్టించి, నిర్మాణాలు చేపడుతున్నారని, అందులో ప్లాట్ల‌ విక్రయాల‌ను మొదలు పెట్టారని ఈటల దృష్టికి తీసుకు వచ్చారు. దీనిపై అనేక సార్లు హైడ్రా కమిషనర్​ రంగనాథ్​, కలెక్టర్​ కు సైతం ఫిర్యాదు చేసినా, స్పందించడం లేదని అన్నారు. ప్రభుత్వ భూమిని కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని ఎంపీ ఈటల రాజేందర్​ హామీ ఇచ్చారు.

Next Story