వడలో ప్రత్యక్షమైన జెర్రీ.. పట్టీపట్టనట్లు ఉన్న హోటల్ యాజమాన్యం

by Chintha Aamani |

ఆకలితో అల్పాహారం తీసుకుందామని వస్తే యాజమాన్యం ఆహారంతో పాటు చనిపోయిన జెర్రీ ని కూడా వండి వార్చింది.

వడలో ప్రత్యక్షమైన జెర్రీ.. పట్టీపట్టనట్లు ఉన్న హోటల్ యాజమాన్యం
X

దిశ, మేడ్చల్ టౌన్ : ఆకలితో అల్పాహారం తీసుకుందామని వస్తే.. యాజమాన్యం ఆహారంతో పాటు చనిపోయిన జెర్రీ ని కూడా వండి వార్చింది. ఒకరోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ కు ఎదురుగా ఉన్న హోటల్ కు మేడ్చల్ పట్టణానికి చెందిన పాండు బుధవారం రాత్రి వెళ్లి, వడను ఆర్డర్ చేశాడు. తనకు ప్లేట్లో వడ్డించిన వడను ముక్కలుగా చేస్తూ తింటుండగా ఒక ముక్కలో జెర్రీ వచ్చింది. దీంతో ఒక్కసారి అవాక్కైన వినియోగదారుడు యాజమాన్యాన్ని నిలదీశాడు.

ఇలా వడ్డిస్తే ప్రజా ఆరోగ్య పరిస్థితి ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే యాజమాన్యం ఇదేం పట్టించుకోకుండా తిరిగి వినియోగదారుడినే దబాయిస్తూ అది అరిటాకులో నారా అంటూ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడ గొడవ చేయొద్దు వెళ్లిపోవాలంటూ అక్కడి నుంచి పంపించివేశారు. జెర్రీ వచ్చిన వడను తిన్న వ్యక్తి వాంతులు చేసుకున్నాడు. కాగా వడలో వచ్చిన జెర్రీ ని తన సెల్ ఫోన్ లో బంధించిన వినియోగదారుడు గురువారం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.

Next Story